Author: వర్మ
•10:01 PM

మా కాలేజి లోని వరండా లో ఒక వర్కర్ పని చేస్తూ మొబైల్ లో మాట్లాడుతున్న దృశ్యం కనిపించింది వెంటనే నా మొబైల్ కెమెరా ని "క్లిక్" అనిపించాను. ఎవరన్నారు భారత దేశం పేద దేశమని, ఎక్కువ ప్రజలు నిరక్షరాస్యులని ? అలాంటి వారికి దృశ్యం చూపిస్తే సరి, వారే ఒప్పుకుంటారు మన దేశంలోని నిరక్షరాస్యులు కూడా టెక్నాలజీ లో ముందుంటారని.



(చిత్రం పెద్దదిగా చూడటానికి దానిపై క్లిక్ చెయ్యండి)

నిజంగా మనదేశం చాలా అభివృద్ధి చెందింది కదూ !!!!


Author: వర్మ
•3:08 AM
1. ధనలక్ష్మి
2. ధాన్యలక్ష్మి
3. ధైర్యలక్ష్మి
4. శౌర్యలక్ష్మి
5. విద్యలక్ష్మి
6. కార్యలక్ష్మి
7. విజయలక్ష్మి
8. రాజ్యలక్ష్మి
మీరూ మరియు మీ కుటుంబము అష్టలక్ష్మిల చే దీవెనలను పొందెదరు గాక.




దీపావళి శుభాకాంక్షలు. ........................ Varma and Vedasamhitha.
Author: వర్మ
•9:50 AM
మనం gmail లేదా Yahoomail నుండి మొబైల్ ఫోన్ కు మెసేజ్ లు పంపటం చాలా తేలిక. సాధారణంగా మొబైల్ కు మెసేజ్ లను పంపడానికి way2sms.com లేదా 160by2.com వంటి సైట్ లను వాడుతుంటాం. కొన్ని కారణాలవల్ల అప్పుడప్పుడు అవి ఓపెన్ అవ్వవు. అటువంటప్పుడు మనం gmail లేదా yahoomail నుండి కూడా మెసేజ్ లను పంపవచ్చును. కాని ఇలా పంపడానికి తప్పనిసరిగా 160by2.com లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

మెయిల్ లో (ఏదయినా) కంపోజ్ మెయిల్ చేసిన తరువాత To (పంపవలసిన ఐడి) ప్రాంతంలో మెసేజ్ స్వీకరించే వారి "మొబైల్ నంబరు@160by2.com" అని టైప్ చెయ్యాలి. తర్వాత Subject ప్రాంతంలో మీ 160by2.com లోని ఐడిని (or your registered Phone Number) టైప్ చెయ్యాలి. తర్వాత సమాచారం వ్రాయవలసిన ప్రాంతంలో సమాచారాన్ని వ్రాసి send నొక్కాలి. అంతే ........ మీరు పంపిన సమాచారం sms రూపంలో చేరవలసిన వ్యక్తికి చేరుతుంది.



( పై చిత్రాన్ని పెద్దదిగా చూడటానికి దానిపై క్లిక్ చెయ్యండి.)

Yahoomail ద్వారా కూడా మొబైల్ కు 160by2.com ప్రమేయం లేకుండా పంపవచ్చును కాని అచట చిన్న limitation ఉండటం వలన మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదేమిటంటే ప్రతి 5 smsలు yahoomail నుండి పంపిన ప్రతిసారి receiver నుండి కనీసం ఒక రిప్లై రావాలి. రిప్లైకి ఒక్కో ఆపరేటర్ ఒక్కోవిధంగా చార్జ్ చేస్తారు కాబట్టి 160by2.com ద్వారా sms పంపటం ఉత్తమం మరియు చాలా సులభం.
Author: వర్మ
•9:06 AM
ఈ మధ్యన విజువల్ బేసిక్ తో ప్రయోగాలు చేస్తున్నాను. అందులో భాగంగా మనకి అప్పుడప్పుడు ఉపయోగకరంగా ఉంటుందని ’కౌంట్ డౌన్ టైమర్’ ప్రోగ్రాం రాసాను. మీకు కూడా ఎప్పుడయినా ఉపయోగపడుతుందేమో ఒకసారి ప్రయత్నించి చూడండి ......... డౌన్ లోడింగ్ కొరకు క్రింది లింకును చూడండి ..........

http://www.mediafire.com?sharekey=228004c545ebbdbf391d7d881749d3a733fc02d892ad7bcfb8eada0a1ae8665a
Author: వర్మ
•9:39 AM
వి౦డోస్ XP మరియు లైనెక్స్ రె౦డూ ఇన్స్టాల్ చేయబడి ఉన్నప్పుడు బూట్ అయ్యే ప్రతిసారి డిఫాల్ట్ బూట్ గా లైనెక్స్ ఉ౦డి అది లైనెక్స్ లోనికి వెళ్ళి కాస్త చికాకు పెడుతు౦ది. ఇటువ౦టప్పుడు వి౦డోస్ ని డిఫాల్ట్ బూట్ డివైజ్ గా చెయ్యడానికి లైనెక్స్ లో చిన్న సెట్టి౦గ్ చెయ్యట౦ ద్వారా సమస్యను పరిష్కరి౦చవచ్చును. అది ....
మొదట కమా౦డ్ లైన్ లో

sudo gedit /boot/grub/menu.lst


అని టైప్ చెయ్య౦డి.( గ్రబ్ ఫోల్డర్ ఏ లొకేషన్ లో ఉ౦దో మొదట సర్చ్ ద్వారా తెలుసుకొ౦డి). కుబు౦టూ లైనెక్స్ లొ gedit ఇన్స్టాల్ చెయ్యబడి లేకపోతే ఈ క్రి౦ది కమా౦డ్ వాడ౦డి.

sudo kate /boot/grub/menu.lst


టైప్ చేసి ఎ౦టర్ నొక్క౦డి. వె౦టనే ఒక text document ఓపెన్ చెయ్యబడుతు౦ది. అ౦దులో ఈ క్రి౦ద ఇవ్వబడిన విషయ౦ ఉ౦టు౦ది.

## default num
# Set the default entry to the entry number NUM. Numbering starts from 0, and
# the entry number 0 is the default if the command is not used.
#
# You can specify 'saved' instead of a number. In this case, the default entry
# is the entry saved with the command 'savedefault'.
# WARNING: If you are using dmraid do not change this entry to 'saved' or your
# array will desync and will not let you boot your system.
default 0

దీనిలో సిస్ట౦ బూట్ అయ్యేటప్పుడు లైనెక్స్ తో పాటు XP ఎన్నవ లైన్ లో ఉన్నదో దాని లైన్ స౦ఖ్యను పైన ఉన్న సమాచార౦లో చివరి లైన్ default 0 అని ఉన్న చోట ’సున్న’ కు బదులుగా లైన్ స౦ఖ్య వ్రాయాలి. Kubuntu మరియు Ubuntu కు ఇది సాధారణ౦గా '6' అ౦కె ఉ౦టు౦ది. తర్వాత ఆ డాకుమె౦ట్ ను save చేసి close చేసి సిస్ట౦ రిష్టార్ట్ చెయ్యాలి.

అపుడు XP డిఫాల్ట్ బూట్ గా సెట్ అవుతు౦ది.
Author: వర్మ
•9:34 AM
టైం మరియు డేట్ కొరకు విజువల్ బేసిక్ లో చిన్న ప్రోగ్రాం వ్రాసాను రన్ చేసి చూడండి. క్రి౦ది లి౦క్ చూడ౦డి.

http://www.mediafire.com/?gdb00xcnczx
Author: వర్మ
•9:33 AM
ఈ మధ్యనే మా పాప ఫొటో తీసాను. ఎలాగు౦దో మీరే చెప్ప౦డి. . . .

Author: వర్మ
•4:29 AM


నేను బి.ఎడ్ చదివే రోజుల్లో ఒక సరదా సంఘటన జరిగింది.
నేను హైదరాబాదు లోని  మాసబ్ ట్యాంక్ ‘‘ కాంప్రహెన్సివ్ ’’ కాలేజీలో బి.ఎడ్ చదివాను. బి.ఎడ్ టీచింగ్ ప్రాక్టీస్ లో భాగంగా మాడల్ హైస్కూల్, బషీర్ బాగ్ లో 8వ తరగతికి బయాలజి క్లాను తీసుకోవలసి వచ్చింది.

నేను తరగతి గదిలోకి వెళ్ళి పిల్లలకు బయాలజీ గురించి ఎంతవరకు తెలుసునో అని తెలుసుకుందామని ఒక ప్రశ్న అడిగాను. అది ....
‘‘ జీవశాస్త్ర పితామహుడు ఎవరు ? ’’ అని అడిగాను.
పిల్లలందరు ముక్తకంఠంతో ‘‘ అబ్రహం సార్ ...... ’’ అన్నారు .
అదేంటి అరిస్ట్రాటిల్ కదా అనాలి ....... అని ఆశ్చర్యపోయి ఎవరు చెప్పారు అని అడిగాను ...
‘‘ మా బయాలజి సార్ చెప్పాడు సర్ ’’ అని అన్నారు.
దానికి మరింత ఆశ్చర్యపోయి ఒక విద్యార్థిని లేపి ఎలాగో వివరించమని అడిగాను ...
దానికి ఆ విద్యార్థి ‘‘ మాకు బయాలజి అబ్రహం సార్ చెపుతాడు సర్ అందుకే ఆయన పేరు చెప్పాం ’’ అన్నాడు .

అప్పుడు నాకర్థమయ్యింది వీరికి ఎవరు ఏ సబ్జెక్ట్ చెబితే వారినే పితామహుడని అనుకుంటున్నారని.
వెంటనే వారికి పితామహుడు అని ఎవరిని అంటారో చెప్పి, అరిస్ట్రాటిల్ పేరును 5సార్లు అనిపించి క్లాసు ముగించి బయటకు వచ్చాను.
తర్వాత మా తోటి మిత్రులతో చెబితే నవ్వులే నవ్వులు ...............