Author: వర్మ
•11:49 AM

స్నేహం




















నువ్వొచ్చిన సంగతి గాలి లోని పరిమళం తెలుపుతుంది
నువ్వెళ్ళిన సంగతి లయ తప్పే నా గుండె చెబుతుంది

కలల్లో నీవే .... కళ్ళలో నీవే ...
ఎదలో నీవే.... నా గుండె సడిలొ నీవే....   

నీతొ గడిపిన సమయం యుగాలైనా క్షణాలైపోతాయి
నువ్వెళ్ళిన వెనువెంటనే ప్రతీ క్షణం  కూడా యుగమై పోతుంది

జీవితమంటే నీతో గడిపిన క్షణాలేనా అని నా మదినడిగితె
కాదు కాదు నీ గురించి ఆలోచించిన క్షణాలు కూడా అని అది చెబుతుంది

స్నేహమంటే అర్థం తెలియని నాకు చల్లని నీ ప్రేమను పంచావు
కన్నటిమయమైన జీవితంలో రేపటిపై ఆశ చిగురింపజెసావు

మాటిస్తున్నా నేస్తం నీ స్నెహాన్ని తుది శ్వాస వరకు వదలనని
ఆ దేవుదు కరునిస్తే మరుజన్మకు కూడా నువ్వే నా నేస్తమని
 
నమ్ముతావా నేస్తం నే చెప్పింది నిజమేనని ???
 
అందుకే ...
 
ఒట్టేసి చెబుతున్నా నేస్తం ....

నేనంటే నువ్వేనని,
నాలోనే నువ్వున్నావని ....
....................

స్నేహంతో .....
నీ ....

వర్మ ......

Author: వర్మ
•12:24 PM

ఆశ




ఇది ఎమి జీవితం ?
రాత్రుళ్ళు నిద్ర కరువాయె
పగళ్ళు శ్రద్ద కరువాయె
మౌనమె దగ్గరి బందువాయె .....

ఖరీదైన వస్తువుల మద్య
నిరుపేదనై నిలుచున్నా .....
మనిషికైన గాయం కన్నా
మనసుకైన గాయం మిన్నని,
విడిచిన బాణం కన్నా
ఆడిన మాటలు వాడని,
ఎపుడు తెలుసుకుంటారో
ఈ మాయ ప్రజలు ......
మంచితనం విలువ తెలియని
అమాయకులని వదిలెయ్యాలో,
కాలం కన్ను కప్పలేరని 

బుద్ది చెప్పాలో తెలియని
సందిగ్ద పరీస్థితి ......
కష్టాలు కన్నీల్లతో పాటు
కవితలు   రప్పిస్తాయని
తెలియలేదు నిజమని నేటివరకు, 
నేటి చీకటే రేపటి
వెలుగన్న గొప్పవారి వాక్కులను 
 వమ్ము చేయక,
జీవిస్తున్నా రేపటి
అరునోదయం పై ఆశతొ ......

మీ ....
..... వర్మ