Author: వర్మ
•4:29 AM


నేను బి.ఎడ్ చదివే రోజుల్లో ఒక సరదా సంఘటన జరిగింది.
నేను హైదరాబాదు లోని  మాసబ్ ట్యాంక్ ‘‘ కాంప్రహెన్సివ్ ’’ కాలేజీలో బి.ఎడ్ చదివాను. బి.ఎడ్ టీచింగ్ ప్రాక్టీస్ లో భాగంగా మాడల్ హైస్కూల్, బషీర్ బాగ్ లో 8వ తరగతికి బయాలజి క్లాను తీసుకోవలసి వచ్చింది.

నేను తరగతి గదిలోకి వెళ్ళి పిల్లలకు బయాలజీ గురించి ఎంతవరకు తెలుసునో అని తెలుసుకుందామని ఒక ప్రశ్న అడిగాను. అది ....
‘‘ జీవశాస్త్ర పితామహుడు ఎవరు ? ’’ అని అడిగాను.
పిల్లలందరు ముక్తకంఠంతో ‘‘ అబ్రహం సార్ ...... ’’ అన్నారు .
అదేంటి అరిస్ట్రాటిల్ కదా అనాలి ....... అని ఆశ్చర్యపోయి ఎవరు చెప్పారు అని అడిగాను ...
‘‘ మా బయాలజి సార్ చెప్పాడు సర్ ’’ అని అన్నారు.
దానికి మరింత ఆశ్చర్యపోయి ఒక విద్యార్థిని లేపి ఎలాగో వివరించమని అడిగాను ...
దానికి ఆ విద్యార్థి ‘‘ మాకు బయాలజి అబ్రహం సార్ చెపుతాడు సర్ అందుకే ఆయన పేరు చెప్పాం ’’ అన్నాడు .

అప్పుడు నాకర్థమయ్యింది వీరికి ఎవరు ఏ సబ్జెక్ట్ చెబితే వారినే పితామహుడని అనుకుంటున్నారని.
వెంటనే వారికి పితామహుడు అని ఎవరిని అంటారో చెప్పి, అరిస్ట్రాటిల్ పేరును 5సార్లు అనిపించి క్లాసు ముగించి బయటకు వచ్చాను.
తర్వాత మా తోటి మిత్రులతో చెబితే నవ్వులే నవ్వులు ...............