Author: వర్మ
•6:55 PM
నేను బి.ఎడ్ చేసే సమయంలో ఒక క్రిష్టియన్ పాఠశాలలో టీచింగ్ ప్రాక్టీసు చెయ్యవలసి వచ్చింది. అక్కడ పనిలో పనిగా ఆ పాఠశాలలో పనిచేసే ఒక టీచర్ పరిచయం అయ్యింది. ఒక సారి చర్చలో కృష్ణుడు 16000మంది స్త్రీలను ఎందుకు పెండ్లాడాడు ? అంత రసికుడినా మీరు పూజించేది అని ఆ టీచర్ ఎద్దేవా చేసింది. నాతోపాటు ఉన్న హిందూ మిత్రులంతా తెల్లమొఖం వేసారు. అవును కదా ... అని ఆ టీచర్ తో ఏకీభవించబోయారు.... ఇంతలో నాకు చిన్నప్పుడు నేర్చకున్న పై ప్రశ్నకు సమాధానం స్పురించింది. వెంటనే వారికి ఈ విధంగా సమాధానం చెప్పాను... అదే మీ ముందుంచుతున్నాను...

" నరకాసురుడు అనే రాక్షసుడు 16000మంది స్త్రీలను చెరబట్టి తన చెరసాలలో భందించాడు. అప్పుడు కృష్ణుడు నరకాసురుని చంపి ఆ స్త్రీలందరిని ఆ చెరనుండి విడిపించాడు. అయితే పరపురుషుని చెరలో ఉండి బయటకు వచ్చిన స్త్రీలందరు తమకు సమాజంలో ఎటువంటి విలువ ఉండదని, తమను సమాజం చిన్నచూపు చూస్తుందని, తమకు పెళ్ళిళ్ళు కావని, తమకు చావే శరణ్యం అని కష్ణునితో మొరపెట్టుకున్నారు.

అపుడు కృష్ణుడు వారికి సమాజం నుండి వచ్చే చిన్నచూపు నుండి రక్షించడానికి, వారికి సోషల్ స్టేటస్ ను కల్పించడానికి వారినందరిని పెండ్లాడి పట్టపు రాణులుగా చేసుకున్నాడు. ఇందులో కృష్ణుడు చేసిన త్యాగం ఉంది కానీ అతని స్వార్థం లేదు. " అని ఆవేశంగా చెప్పి ముగించాను. అంతే ఆ మరుక్షణం ఆ టీచర్ అక్కడి నుండి అదృష్యమయ్యింది. నా మిత్రలందరూ నన్ను అభినందించారు.

హరిసేవ లో దుర్గేశ్వర గారు రామాయణం గురించి వ్రాసిన విధానం, విశ్లేషణ చే ప్రభావితమై ఇది రాస్తున్నాను. హిందువులై ఉండి కూడా భిన్నంగా ఆలోచించాలి అనే విచిత్రమైన పోకడలతో సరియైన విధంగా హిందుత్వాన్ని, ఇతిహాసాల్ని అర్థంచేసుకోక విచిత్రమైన వాదనలతో హిందువులలోనే సందేహాలు రేకెత్తించే విధంగా కొందరు వాదిస్తున్నారు. మన ఇతిహాసాల్లో గల ప్రతి సంఘటనకు ఒక విష్లేషణ ఉంటుంది అది సూక్ష్మంగా ఆలోచిస్తేనే తెలుస్తుంది.
Author: వర్మ
•2:20 AM

మీకు సంక్రమించబోయే గోహత్యా మహాపాతకం నుండి తప్పించుకోవాలంటే కూరగాయల, పండ్ల మిగులు ముక్కలు, మిగిలిన అన్నం, వండిన పదార్థాలు ఇతర ఎలాంటి తినుబండారాలు పాలిథిన్ ప్లాస్టిక్ కవర్లలో వేసి పారవేయకండి. కవర్లలలోని పదార్థాలను తినబోయి ఆవులు కవర్లను మింగి సుమారు 25కిలోల కవర్ నిల్వలు కడుపులో పేరుకుపోయి విషపు గ్యాస్ ఫామ్ అయి కడుపు ఉబ్బి భయంకర వ్యాధులు సోకి నరకయాతనతో ఘోరంగా మరణిస్తున్నాయి. ఇది ఒక రకమయిన ' గోహత్యా ' అని ధర్మశాస్త్రంచే నిర్ధారించబడినది.



Author: వర్మ
•8:00 AM
  1. లేవడంలో - కోడి
  2. పరుగులో - గుర్రం
  3. వినడంలో - పిల్లి
  4. విశ్వాసంలో - కుక్క
  5. తల్లిగా - ఆవు
  6. సేవలో - ఎద్దు
  7. శాంతికి - పావురం
  8. గానములో - కోకిల
  9. నాట్యంలో - నెమలి
  10. విజ్ఞానానికి - హంస
  11. పౌరుషంలో - పొట్టేలు
  12. సాహసంలో - పులి
  13. పరాక్రమంలో - సింహం
  14. బుద్దిలో - ఏనుగు
  15. నిరంతర శ్రమకు - చీమ.
  16. నిశిత దృష్టిలో - గరుత్మంతుడు
* ఇతర ప్రాణులకు ఒకే గుణం ఉంటుంది. మానవ జాతికి అనేక గుణాలు ఉంటాయి.

* ప్రతి మనిషిలో విశేషంగా ఏదో ఒక ప్రాణి గుణం ఉంటుంది.
Author: వర్మ
•8:02 AM
  • ఇంటిపై ఓంకార చిహ్నము.
  • ఇంటిపై కాషాయ ధ్వజము.
  • ఇంటి వాకిట్లో తులసి.
  • ఇంటిలో మహనీయుల, దేవతల, భరతమాత చిత్రపటములు.
  • ఇల్లు, ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు
  • ఇంటిలో శుభ్రమైన త్రాగునీటి వ్యవస్థ, మురుగు నీరు పోవుటకు వ్యవస్థ
  • ఇంటి ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు మరియు వేప, కానుగ వంటి నీడనిచ్చు మొక్కల పెంపకం
  • ఇంటిలోని వారంతా ప్రాత:కాలమే లేచుట, వెంటనే కాలకత్యాలు తీర్చుకొనుట.
  • ప్రతినిత్యం స్నానం, కుంకుమధారణ, దేవునికి నమస్కరించుట.
  • కుటుంబ సభ్యులు నియమితంగా మందిర దర్శనము చేసికొనుట.
  • పిన్నలు తమ ఇంటిలోని పెద్దలకు, తల్లిదండ్రులకు పాదాభివందనం చేయుట.
  • భోజనం ముందు భగవంతుని స్మరించి భుజించుట.
  • ఇంటివారంతా కనీసం ఒకపూట కలసి భుజించుట.
  • ఇంటివారంతా ఆత్మీయంగా కలసిమెలసి ఉండుట.
  • ఇంటిలో అతిధి మర్యాదలను పాటించుట.
  • కుటుంబ వాతావరణం సంస్కార ప్రదంగా ఉండుట.
  • హిందూ పద్దతిలో పండగలు జరుపుకొనుట.
  • ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండుట.
  • ఇంట్లోని వారంతా సమరసతను పాటించుట.
  • ఇంట్లోని బాల బాలికలు, యువతీ యువకులు విద్యార్జన చేయుట.
  • మాతృభాషను, సంస్కతమును అభ్యసించుట.
  • ఇంటిలో రామాయణ, భారత, భాగవత, భగవద్గీత మొదలగు గ్రంథములను పఠించే వ్యవస్థ
  • ఇంటిలో టెలివిజన్, టేపురికార్డర్ ల వాడకముపై అదుపు.
  • ఇంటిలో స్వదేశీ వస్తువులనే వాడుట, విదేశీ వ్యామోహానికి దూరంగా ఉండుట.
  • ఇంటిలో మితవ్యయమును పాటించుట.
  • ధర్మకార్యక్రమాల కొరకు ఖర్చు చేయుట.
  • పర్యావరణ సంరక్షణపై దృష్టి వుంచుట.
  • ఇంటిలోని వారంతా పొగాకు, మద్యపానము, జూదము మొదలగు దుర్వ్యసనాలకు దూరముగా ఉండుట.
  • ఇంటి వారంతా సమాజ హిత కార్యములో పాల్గొనుట.
  • సంఘ విద్రోహులను అదుపు చేయుట.
.....................................................................................................................................................