•8:02 AM
- ఇంటిపై ఓంకార చిహ్నము.
- ఇంటిపై కాషాయ ధ్వజము.
- ఇంటి వాకిట్లో తులసి.
- ఇంటిలో మహనీయుల, దేవతల, భరతమాత చిత్రపటములు.
- ఇల్లు, ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు
- ఇంటిలో శుభ్రమైన త్రాగునీటి వ్యవస్థ, మురుగు నీరు పోవుటకు వ్యవస్థ
- ఇంటి ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు మరియు వేప, కానుగ వంటి నీడనిచ్చు మొక్కల పెంపకం
- ఇంటిలోని వారంతా ప్రాత:కాలమే లేచుట, వెంటనే కాలకత్యాలు తీర్చుకొనుట.
- ప్రతినిత్యం స్నానం, కుంకుమధారణ, దేవునికి నమస్కరించుట.
- కుటుంబ సభ్యులు నియమితంగా మందిర దర్శనము చేసికొనుట.
- పిన్నలు తమ ఇంటిలోని పెద్దలకు, తల్లిదండ్రులకు పాదాభివందనం చేయుట.
- భోజనం ముందు భగవంతుని స్మరించి భుజించుట.
- ఇంటివారంతా కనీసం ఒకపూట కలసి భుజించుట.
- ఇంటివారంతా ఆత్మీయంగా కలసిమెలసి ఉండుట.
- ఇంటిలో అతిధి మర్యాదలను పాటించుట.
- కుటుంబ వాతావరణం సంస్కార ప్రదంగా ఉండుట.
- హిందూ పద్దతిలో పండగలు జరుపుకొనుట.
- ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండుట.
- ఇంట్లోని వారంతా సమరసతను పాటించుట.
- ఇంట్లోని బాల బాలికలు, యువతీ యువకులు విద్యార్జన చేయుట.
- మాతృభాషను, సంస్కతమును అభ్యసించుట.
- ఇంటిలో రామాయణ, భారత, భాగవత, భగవద్గీత మొదలగు గ్రంథములను పఠించే వ్యవస్థ
- ఇంటిలో టెలివిజన్, టేపురికార్డర్ ల వాడకముపై అదుపు.
- ఇంటిలో స్వదేశీ వస్తువులనే వాడుట, విదేశీ వ్యామోహానికి దూరంగా ఉండుట.
- ఇంటిలో మితవ్యయమును పాటించుట.
- ధర్మకార్యక్రమాల కొరకు ఖర్చు చేయుట.
- పర్యావరణ సంరక్షణపై దృష్టి వుంచుట.
- ఇంటిలోని వారంతా పొగాకు, మద్యపానము, జూదము మొదలగు దుర్వ్యసనాలకు దూరముగా ఉండుట.
- ఇంటి వారంతా సమాజ హిత కార్యములో పాల్గొనుట.
- సంఘ విద్రోహులను అదుపు చేయుట.
3 comments:
బాగుంది మనం పాటిస్తే ఇంకా బాగుంటుంది
వర్మ.. చాలా బాగున్నాయి..
Excellent. Thanks for compiling this information.