Author: వర్మ
•11:42 AM
నేను ఉపాధ్యాయుడిని కావటం వలన మా పాఠశాలలో ఇటీవల ప్రబుత్యం ప్రవేశపెట్టిన నిజాయితీ పెట్టె గురించి కొన్ని వాక్యాలు వ్రాయాలనుకున్నాను.
మా పాఠశాలలో గల నిజాయితీ పెట్టె పిల్లల్లో నిజాయితీని ప్రోత్సహించడానికి నిర్దేశించబడినది. ఎవరైనా విద్యార్థికి ఏదైనా వస్తువు దొరికితే దానిని తనవద్ద ఉంచుకోక ఆ నిజాయితీ పెట్టెలో వేస్తాడు . దానిని ఆరోజు పిల్లలందురు పాఠశాలను వదిలి వెళ్లేటపుడు మా ప్రధానోనాద్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను విచారించి ఆ వస్తువు ఏ విద్యార్థికి చెందుతుందో ఆ విద్యార్థికి అప్పజెబుతారు, అంతేకాకా ఆ వస్తువును తెచ్చి ఆ పెట్టెలో వేసిని విద్యార్థిని మిగితా విద్యార్థుల ముందు అతని నిజాయితిని మెచ్చుకుంటారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, పిల్లల్లో నిజాయితీని ప్రోత్సహించడం. నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిజాయితీ పెట్టెను ప్రవేశపెట్టడం హర్షనీయం .....
ప్రస్తుత సమాజంలో డజను అరటిపళ్లు కొన్నా అందులో ఒకటో రెండో పుచ్చులు రావడం ఖాయం. నిజాయతీగా తోటి వ్యక్తికి సాయపడదామన్న ఆలోచన కొరవడిన తరుణంలో మొగ్గగా ఉన్నపుడే ఈ లక్షణాలను అలవరచడానికి ఇలాంటి పాఠశాలల్లో ప్రవేశపెట్టడం చాలా అవసరం.
’’పాఠశాలల్లో జరగవలసింది వ్యక్తి నిర్మాణం మరియు శీల నిర్మాణం’’ అన్నట్టుగా విద్యార్థిని సమాజానికి పనికివచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దడం పాఠశాలల లక్షం. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తాయని ఆశిద్దాం !!!!!
Author: వర్మ
•10:14 AM
dc.exe వైరస్ పూర్తి స్వరూపం dungcoi.exe ఇది సిస్టంలోకి memory cards, pendrives వలన ప్రవేశిస్తుంది. ఈ వైరస్ లక్షణం ఏమిటంటే ఇది కర్సర్ ను busy గా ఉంచి సిస్టంను చాలా స్లో చేస్తుంది. ఈ వైరస్ కు సంబందించిన exe ను ఫోల్డర్ రూపంలో c:\windows లో చూడవచ్చును. కానీ దానిని తొలగించలేము. తొలగించాలని చూస్తె The file is currently in use అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దీనిని తోలగించడానికి avg కానీ, avast కానీ, Mcafe కానీ, smart antivirus కానీ ఆంటీవైరస్ లు పనిచేయవు.

దీనిని తొలగించాలంటే ఒక్కటే మార్గం అది..... సిస్టంను safemode with command propmt లో ఆన్ చేసి అందులో command prompt లో c:\windows లోకి డాస్ కమాండ్స్ ద్వారా వెళ్ళి del dc.exe అని టైప్ చేస్తే వైరస్ తొలగిపోతుంది. తర్వాత సిస్టంను నార్మల్ గా రిబూట్ చెయ్యండి.
Author: వర్మ
•10:08 AM
ఈ మద్య వస్తున్న చాలా వైరస్ లు మొదట సిస్టంలోని Taskmanager ను, Run , Registry Edit ను డిసేబుల్ చేస్తున్నాయి. ఈ వైరస్ లు Fun.Exe లేదా dc.exe వంటివి కావచ్చు . ఈ సందర్బంలో Task manager రన్ కాకపొవటం వలన ఎన్ని ప్రాసెస్లు రన్ అవుతున్నాయో తెలుసుకోవటం కష్టం అవుతుంది. కానీ సిస్టంను ఫార్మాట్ చేయకుండానే పై వాటిని restore చేయవచ్చును.

http://od3n.net/download/ సైట్ లోకి వెళ్ళి Smart antivirus ను మొదట డౌన్లోడ్ చేసుకోవాలి, smart antivirus ను setup చేసిన తరువాత రన్ చేయాలి. మిగితా ఆంటీవైరస్ ల లాగా smart antivirus క్లిక్ చేయగానే రన్ కాక సిస్టం ట్రెలో వచ్చి చేరుతుంది. సిస్టం ట్రేలో దానిని సెలక్ట్ చేసి Launch smart antivirus క్లిక్ చెయ్యాలి. అందులో restore windows default setting ను క్లిక్ చేసి తర్వత వచ్చే options లో మన సిస్టంలో ఏవేవి disable అయ్యాయో అవి సెలక్ట్ చెయ్యాలి. (default గా మన సిస్టంలో disable అయినవి ముందుగానే సెలక్ట్ చెయ్యబడి ఉంటాయి). తర్వాత ok నొక్కి సిస్టంను రిస్టాట్ చేయాలి.
ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆంటీవైరస్ ఇది newfolder.exe వైరస్ ను చాలా సమర్థవంతంగా తొలగిస్తుంది.దీని కొరకు remove virus from a folder ను క్లిక్ చేసి స్కాన్ చెయ్యాలి.
పైన తెలిపిన సైట్ లో వీటికే కాక చాల రకాల వైరస్ లను తొలగించే టూల్స్ లభిస్తాయి.
Author: వర్మ
•11:01 AM

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మానవుని జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ప్లాస్టిక్ వాడకం పెరగటం. మన పని సులువవుతుంది కదా అని మార్కెట్ కు వెళ్ళటం నుండి మొదలుపెట్టి, పెద్ద పెద్ద కంటేనర్ల వరకు అంతా ప్లాస్టిక్ మయం .. ప్లాస్టిక్ వాడితే మనకవుతున్న నష్టం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ? అక్కడికే వస్తున్నా. ప్లాస్టిక్ చర్యాశీలత చాలా తక్కువ కావటం వలన అది ఎన్ని సంవత్సరాలైనా కుళ్ళిపోయి భూమిలో కలిసిపోదు. దీని వలన భూమిపై పడిన వర్షం భూమిలోకి ఇంకక భూగర్ఛజలాలు అడుగంటుతాయి, మొక్కలు సరిగా పెరగవు. ఏది ఏమైనా మనం ప్లాస్టిక్ ను ఇలాగే వాడుతూ పోతె చివరకు మనందరం చేతిలో కర్ర పుచ్చుకుని కవర్లు, ప్లాస్టిక్ ముక్కల్ని పక్కకు జరుపుకుంటూ వెళ్ళాల్సి వస్తుందేమో?? నిజంగా ఆరోజు ఎంతో దూరం లేదు. కనీసం మనం ఇకనైనా మేల్కొని ప్లాస్టిక్ కవర్ల వాడాకాన్నైనా తగ్గిద్దాం. చిన్న సబ్బు కొన్నా కవర్ అడిగే సంస్క్రతికి టాటా చెప్పేద్దాం. మొత్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని మానేయలేం కాని దాని వాడకాన్ని తగ్గించవచ్చు.

నాకు అన్నింటికన్నా బాధకలిగించిన విషయం నోరులేని మూగ జీవాలు కూడా ప్లాస్టిక్ కాటుకు బలవుతున్నాయి. ఇటీవల ఒక ఆవు జీర్ణాశయం నుండి 40కిలోల కవర్లు వెలికితీసారు. దీనికి ప్రధాన కారణం మనం తినగా మిగిలిన ఆహారపదార్థాలను కవర్లో వేసి బయట పడేస్తున్నాం వాటిని ఈ మూగజీవాలు ఆహారాన్ని వెలికితీయటం రాక కవర్ తో సహా తినివేసి అది అరగక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాయి. అందుకే ఆహారపదార్థాలను కవర్లలో ఉంచి బయట పారవేయటం శ్రేయస్కరం కాదు. వీలయినంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దా శుభ్రమైన కలుషితం లేని ప్రపంచాన్ని మన తరువాత తరాలకు అందిద్దాం.

ఏమంటారు....... నాతో ఏకీభవిస్తారా ?????

Author: వర్మ
•6:16 PM




నా చిట్టి తల్లి పేరు హనీ(తేనే). నిజంగానే తను నా జీవితంలో తేనె వంటిదే. చాలా
అల్లరి చేస్తుంది. చిట్టి చిట్టి మాటలతో ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తుంది.
తన చేష్టలన్నీ ప్రత్యేకం. కొంచెం కొంటెతనం,కొంత అమాయకం ఇవన్నీ కలిస్తేనే
నా చిట్టితల్లి. నిజంగా తనంటే నాకెంతో ఇష్టం తనతో ఉంటే సమయమే తెలియదు..
తను ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ
నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ............ వర్మ