పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మానవుని జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ప్లాస్టిక్ వాడకం పెరగటం. మన పని సులువవుతుంది కదా అని మార్కెట్ కు వెళ్ళటం నుండి మొదలుపెట్టి, పెద్ద పెద్ద కంటేనర్ల వరకు అంతా ప్లాస్టిక్ మయం .. ప్లాస్టిక్ వాడితే మనకవుతున్న నష్టం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ? అక్కడికే వస్తున్నా. ప్లాస్టిక్ చర్యాశీలత చాలా తక్కువ కావటం వలన అది ఎన్ని సంవత్సరాలైనా కుళ్ళిపోయి భూమిలో కలిసిపోదు. దీని వలన భూమిపై పడిన వర్షం భూమిలోకి ఇంకక భూగర్ఛజలాలు అడుగంటుతాయి, మొక్కలు సరిగా పెరగవు. ఏది ఏమైనా మనం ప్లాస్టిక్ ను ఇలాగే వాడుతూ పోతె చివరకు మనందరం చేతిలో కర్ర పుచ్చుకుని కవర్లు, ప్లాస్టిక్ ముక్కల్ని పక్కకు జరుపుకుంటూ వెళ్ళాల్సి వస్తుందేమో?? నిజంగా ఆరోజు ఎంతో దూరం లేదు. కనీసం మనం ఇకనైనా మేల్కొని ప్లాస్టిక్ కవర్ల వాడాకాన్నైనా తగ్గిద్దాం. చిన్న సబ్బు కొన్నా కవర్ అడిగే సంస్క్రతికి టాటా చెప్పేద్దాం. మొత్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని మానేయలేం కాని దాని వాడకాన్ని తగ్గించవచ్చు.
నాకు అన్నింటికన్నా బాధకలిగించిన విషయం నోరులేని మూగ జీవాలు కూడా ప్లాస్టిక్ కాటుకు బలవుతున్నాయి. ఇటీవల ఒక ఆవు జీర్ణాశయం నుండి 40కిలోల కవర్లు వెలికితీసారు. దీనికి ప్రధాన కారణం మనం తినగా మిగిలిన ఆహారపదార్థాలను కవర్లో వేసి బయట పడేస్తున్నాం వాటిని ఈ మూగజీవాలు ఆహారాన్ని వెలికితీయటం రాక కవర్ తో సహా తినివేసి అది అరగక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాయి. అందుకే ఆహారపదార్థాలను కవర్లలో ఉంచి బయట పారవేయటం శ్రేయస్కరం కాదు. వీలయినంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దా శుభ్రమైన కలుషితం లేని ప్రపంచాన్ని మన తరువాత తరాలకు అందిద్దాం.
ఏమంటారు....... నాతో ఏకీభవిస్తారా ?????
3 comments:
good thought.. We need to educate people...Governments also need to bring stingent rule to stop it..
వర్మగారు,
బ్లాగ్లోకానికి స్వాగతం. చాలా మంచి విషయాలు చెప్పారు. అధికారులు, ప్రభుత్వం వచ్చి చేయాలి అని ఎదురుచూడకుండా ముందుగా మనకుమనమే ఈ కార్యక్రమం మొదలు పెట్టాలి. ఏ మంచి పనైనా పదిమందికి చెప్పే ముందు మన ఇంటి నుంది మొదలుపెట్టాలి..
ఆల్రెడీ ఈ విషయంలో ఏకీభావంతోనే ఉన్నాం సార్.
వారం క్రితం జరిగిన బత్తీబంద్ చర్చలో ఈ విషయాన్ని పలువురు ప్రస్తావించారు. దేశ విదేశాల్లోని మన మిత్రులు గుడ్డ సంచులే వాడుతున్నామనీ, వాడబోతామనీ ఘంటాపథంగా చెప్పారు.
పూర్తి నివేదిక ఇక్కడ చూడచ్చు.
http://kottapali.blogspot.com