•6:16 PM
నా చిట్టి తల్లి పేరు హనీ(తేనే). నిజంగానే తను నా జీవితంలో తేనె వంటిదే. చాలా
అల్లరి చేస్తుంది. చిట్టి చిట్టి మాటలతో ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తుంది.
తన చేష్టలన్నీ ప్రత్యేకం. కొంచెం కొంటెతనం,కొంత అమాయకం ఇవన్నీ కలిస్తేనే
నా చిట్టితల్లి. నిజంగా తనంటే నాకెంతో ఇష్టం తనతో ఉంటే సమయమే తెలియదు..
తను ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ
నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ............ వర్మ
కబుర్లు
|
8 comments:
అయ్యా వర్మ గారు,బ్లాగులోకానికి స్వాగతం,
మీ చిట్టితల్లిని మాకు ఇస్తే నీకొక బబ్లు గాడిని ఇస్తా,నెలకు రెండువేల అల్లరెలవెన్సుతో సహా ఆలోచించుకోండి
చిట్టితల్లికి నా దీవెనలు.
ముందుగా మీ చిట్టి తల్లికి నా ముద్దులు. మీ చిట్టి తల్లి మా అక్క కుతురును గుర్తుకు తెచ్హింది తను అంటె నాకు ప్రాణం. మీ తండ్రీ కుతుళ్ళ కు నా ప్రత్యెక అభినందనలు.
రాజేంద్రకుమార్ గారు మీ దీవెనలు మా చిట్టి తల్లికి మీ దీవెనలు ఎప్పటికీ కావాలి. మీ అభిమానానికి ధన్యవాదాలు ..... వర్మ
తను ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ
నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ............ ramya
మీ చిట్టి తల్లి ఎంత ముద్దు గా ఉందండీ. నిండు నూరేళ్ళు తనకు. మా ఇంట ఓ చిన్నారి ఆగస్టు లో రాబోతుంది (రాబోతాడు ??) ... అప్పుడు మీ చిన్నారి కి మా ఇంట చిన్నారికీ నవ్వుల పోటీ పెడదాం. ఏమంటారు ?
అయ్యా రవిగారు,ముందస్తు అభినందనలు,
పైన చెప్పిన బబ్లు గాడు అన్న దుండగుదు పుట్టింది కూడా ఆగస్టు నెలలోనే,ఆమాటకొస్తే మా పాప కూడా ఆగస్టునెలలోనె పుట్టింది అయినా నెలదేముంది లెండి పండంటి పాపాయి సుఖంగా మన మధ్యకు రావాలి గాని
రవి గారు ముందుగా మీకు అభినందనలు. కొత్తగా రాబోయే బాబుకు మనందరం స్వాగతం పలుకుదాం .
వర్మ గారూ,
మీ అమ్మయికి మా అందరి దిష్టే తగిలేటట్టుంది.. ముందుగా ఇవ్వాళ్ళ రాత్రికి ఉప్పుతీయ్యండి.
నాలాంటి కుళ్ళుకునే కళ్ళు చాలా ఉంటాయి.. పిల్లలకు అవి మంచిది కాదు. ఎందుకైనా మంచిది నామాట మన్నించండి.