Author: వర్మ
•5:31 PM

 మరుపు

 

 

 

 

 

 

నిను మరవాలనే తలపుతో

మౌనంగా కూర్చుంటాను,

క్షణమైనా గడవదు, ఎటువైపు నుండి వస్తుందో కాని

పిల్ల తెమ్మెరలా నీ తలపు

మదిని చల్లగా తాకుతుంది

ఆ తరువాత ఒకదానికొకటి కలిసిన గొలుసులా

నీ జ్ఞాపకాల తెమ్మెరలు ....

పది నిమిషాల గడిచాక

మదిలో నీ రూపం క్రమంగా ఎదుగుతూ

చివరకు మలయ మారుతమై నిలుచుంటుంది.

అంతటితో ముగుస్తుంది నా మౌనముద్ర

మల్లీ మొదలవుతుంది నీ

జ్ఞాపకాల వెల్లువ ....

నీ ఎడబాటు నా ఎదను కాల్చుతుంది

అయినా తప్పదు కదా ...

ప్రస్తుతం పరిస్థితిలో

పుస్తకాలే నా స్నేహితులు,

నీ జ్ఞాపకాలే నా దగ్గరి బందువులు ....

....వర్మ