Author: వర్మ
•8:58 PM


బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటి దృష్ట్యా బ్యాంకులు వివిధ సేవలను అందిస్తున్నాయి. అందులో బాగంగా మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును స్టేట్ బ్యాంక్ విజయవంతంగా నడుపుతుంది. ఇది చాల సులభం.

దీనికి మొదట జీ.పీ.ఆర్.ఎస్ / wap సపోర్టు చేసె మొబైల్ కావాలి. 

క్రింద ఈ సర్వీసు వాడుకోవడానికి చేయవలసిన పనులను దశల వారిగా వివరిస్తాను .....

1) మొదట మన మొబైల్ నుండి MBSREG అని టైపు చేసి 9223440000 కి ఎస్.ఎం.ఎస్ చేయాలి. వెంటనే మనకు "యూజర్ ఐడి " మరియు " Default MPIN"  లు మెసేజ్ రూపంలో వస్తాయి.

2) మన మొబైల్ కి పై రెండింటి తో పాటు మొబైల్ బ్యాంకింగ్  సర్వీసుకు సంబందించిన సాఫ్టువేర్ లింకు కూడా వస్తుంది. సాఫ్టువేర్ ను మొబైల్ లోకి డైరెక్టుగా కాని, లేక కంప్యూటర్ లోనికి గాని, డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లోకి వేసుకుని ఇనిస్టాల్ చేసుకోవాలి.


అప్లికేషన్ సాఫ్టువేర్ ను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడానికి లింక్ :
 http://mobile.prepaidsbi.com/sbidownloader/downloadapp.jsp

3) సాఫ్టువేర్ మొబైల్ లోనికి వచ్చిన తరువాత మనకు మొదట వచ్చిన యూజర్ ఐడి  తో లాగిన్ అవ్వాలి. తరువాత Settings ను ఎంపిక చెసుకుని "Change Channel > GPRS" ను సెలెక్టు చేసుకోవాలి. ఇపుడు మొదట మెసేజ్ ద్వారా వచ్చిన default MPIN ను ఎంటర్ చేయ్యాలి. GPRS కనెక్టు అవడానికి మన అనుమతిని అడుగుతుంది YES ను సెలెక్టు చెయ్యాలి. కొద్ది సేపటి తరువాత మల్లీ MPIN ను ఎంటర్ చెయ్యమని అడుతుంది. రెండవ సారి MPIN ఎంటర్ చెయ్యగానే మన మొబైల్ నుండి ఒక మెసేజ్ పంపుతుంది.

దీని ద్వారా మనం download చేసుకున్న అప్లికేషన్ GPRS ద్వారా లావాదేవీలు జరపడానికి సిద్దంగా ఉంటుంది. " Your transactions over GPRS successful " అనే మెసేజ్ మన మొబైల్ కు వస్తుంది.

4) ఈ దశలో మన మొబైల్ హ్యాండ్ సెట్ వాలిడేట్ చెయ్యబడుతుంది.

ఇప్పుడు అప్లికేషన్ లొ settings లోనికి వెల్లి, Change MPIN సెలెక్టు చేసుకోవాలి. ఇప్పుడు మన పాత default MPIN ను ఎంటర్ చేసి దాని కింద కేటాయించిన స్థలంలొ రెండుసార్లు మనకు నచ్చిన ఆరంకెల (6 అంకెలు తప్పనిసరి) కొత్త MPIN సెలెక్టు చేసుకొవాలి. ఇది మనం జరిపే లావాదేవీలన్నింటికి అవసరమవుతుంది.

ఇప్పుడు మన మొబైల్ కు " Your Handset validation successful" అనే సందేశం వస్తుంది.

5) ఇది చివరి దశ. ఇప్పుదు ATM సెంటర్ కు వెల్లి మన అకౌంట్ ను మన మొబైల్ కి జత చెయ్యాలి.
ATM దగ్గరకు వెళ్లి కార్డును పెట్టగానే "Mobile Registration" అనే లింకు కనబడుతుంది. దాన్ని సెలెక్టు చేసుకుని "మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్" ద్వారా మన మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చెయ్యాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యగానే మనకు " Mobile banking registration successful " అని ఉన్న స్లిప్ వస్తుంది. వెంటనే మన మొబైల్ కు మన ఎకౌంటు నెంబర్ తో పాటు mobile రిజిస్ట్రేషన్  అయినట్లు conformation మెసేజ్ వస్తుంది.

దీనితో మన మొబైల్ లోనికి బ్యాంకు వచ్చి చేరినట్లే. దీనిద్వారా ఏ మొబైల్ కయినా recharge చేసుకోవచ్చు (select "Mobile Topup"). ఎవరి ఎకౌంటు లోకైనా మన మొబైల్ నుండే డబ్బులు పంపవచ్చు (Fund transfer > register payee) . మన ఎకౌంటు లోని బాలన్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు (Enquiry sevices > Balance Enquiry or Mini Statement).

మీరే వాడి చూడండి ......
Author: వర్మ
•9:50 AM
మనం gmail లేదా Yahoomail నుండి మొబైల్ ఫోన్ కు మెసేజ్ లు పంపటం చాలా తేలిక. సాధారణంగా మొబైల్ కు మెసేజ్ లను పంపడానికి way2sms.com లేదా 160by2.com వంటి సైట్ లను వాడుతుంటాం. కొన్ని కారణాలవల్ల అప్పుడప్పుడు అవి ఓపెన్ అవ్వవు. అటువంటప్పుడు మనం gmail లేదా yahoomail నుండి కూడా మెసేజ్ లను పంపవచ్చును. కాని ఇలా పంపడానికి తప్పనిసరిగా 160by2.com లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

మెయిల్ లో (ఏదయినా) కంపోజ్ మెయిల్ చేసిన తరువాత To (పంపవలసిన ఐడి) ప్రాంతంలో మెసేజ్ స్వీకరించే వారి "మొబైల్ నంబరు@160by2.com" అని టైప్ చెయ్యాలి. తర్వాత Subject ప్రాంతంలో మీ 160by2.com లోని ఐడిని (or your registered Phone Number) టైప్ చెయ్యాలి. తర్వాత సమాచారం వ్రాయవలసిన ప్రాంతంలో సమాచారాన్ని వ్రాసి send నొక్కాలి. అంతే ........ మీరు పంపిన సమాచారం sms రూపంలో చేరవలసిన వ్యక్తికి చేరుతుంది.



( పై చిత్రాన్ని పెద్దదిగా చూడటానికి దానిపై క్లిక్ చెయ్యండి.)

Yahoomail ద్వారా కూడా మొబైల్ కు 160by2.com ప్రమేయం లేకుండా పంపవచ్చును కాని అచట చిన్న limitation ఉండటం వలన మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదేమిటంటే ప్రతి 5 smsలు yahoomail నుండి పంపిన ప్రతిసారి receiver నుండి కనీసం ఒక రిప్లై రావాలి. రిప్లైకి ఒక్కో ఆపరేటర్ ఒక్కోవిధంగా చార్జ్ చేస్తారు కాబట్టి 160by2.com ద్వారా sms పంపటం ఉత్తమం మరియు చాలా సులభం.
Author: వర్మ
•9:39 AM
వి౦డోస్ XP మరియు లైనెక్స్ రె౦డూ ఇన్స్టాల్ చేయబడి ఉన్నప్పుడు బూట్ అయ్యే ప్రతిసారి డిఫాల్ట్ బూట్ గా లైనెక్స్ ఉ౦డి అది లైనెక్స్ లోనికి వెళ్ళి కాస్త చికాకు పెడుతు౦ది. ఇటువ౦టప్పుడు వి౦డోస్ ని డిఫాల్ట్ బూట్ డివైజ్ గా చెయ్యడానికి లైనెక్స్ లో చిన్న సెట్టి౦గ్ చెయ్యట౦ ద్వారా సమస్యను పరిష్కరి౦చవచ్చును. అది ....
మొదట కమా౦డ్ లైన్ లో

sudo gedit /boot/grub/menu.lst


అని టైప్ చెయ్య౦డి.( గ్రబ్ ఫోల్డర్ ఏ లొకేషన్ లో ఉ౦దో మొదట సర్చ్ ద్వారా తెలుసుకొ౦డి). కుబు౦టూ లైనెక్స్ లొ gedit ఇన్స్టాల్ చెయ్యబడి లేకపోతే ఈ క్రి౦ది కమా౦డ్ వాడ౦డి.

sudo kate /boot/grub/menu.lst


టైప్ చేసి ఎ౦టర్ నొక్క౦డి. వె౦టనే ఒక text document ఓపెన్ చెయ్యబడుతు౦ది. అ౦దులో ఈ క్రి౦ద ఇవ్వబడిన విషయ౦ ఉ౦టు౦ది.

## default num
# Set the default entry to the entry number NUM. Numbering starts from 0, and
# the entry number 0 is the default if the command is not used.
#
# You can specify 'saved' instead of a number. In this case, the default entry
# is the entry saved with the command 'savedefault'.
# WARNING: If you are using dmraid do not change this entry to 'saved' or your
# array will desync and will not let you boot your system.
default 0

దీనిలో సిస్ట౦ బూట్ అయ్యేటప్పుడు లైనెక్స్ తో పాటు XP ఎన్నవ లైన్ లో ఉన్నదో దాని లైన్ స౦ఖ్యను పైన ఉన్న సమాచార౦లో చివరి లైన్ default 0 అని ఉన్న చోట ’సున్న’ కు బదులుగా లైన్ స౦ఖ్య వ్రాయాలి. Kubuntu మరియు Ubuntu కు ఇది సాధారణ౦గా '6' అ౦కె ఉ౦టు౦ది. తర్వాత ఆ డాకుమె౦ట్ ను save చేసి close చేసి సిస్ట౦ రిష్టార్ట్ చెయ్యాలి.

అపుడు XP డిఫాల్ట్ బూట్ గా సెట్ అవుతు౦ది.
Author: వర్మ
•2:01 AM
మనం నోట్ ప్యాడ్ ను గానీ, పేజ్ మేకర్, కాలిక్యులేటర్ వంటి కొన్ని ప్రోగ్రాములు ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెనూలోకి వెళ్ళి వాటిని సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది లేదా డెస్క్ టాప్ పై వాటి షార్ట్ కట్లను ఉంచవలసి వస్తుంది. కానీ .. తక్కువ సమయంలోనే వాటిని తెరవడానికి మనం 'రన్' ను వాడుకోవచ్చును. రన్ ను స్టార్ట్ మెనూ నుండి తెరవవచ్చు లేదా (విండోస్ బటన్+Rను) ప్రెస్ చేసి కానీ తెరవవచ్చును. కీబోర్డ్ పై (విండోస్ బటన్+Rను) ప్రెస్ చేసి రన్ విండోలో cmdఅని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే కమాండ్ విండో ప్రత్యక్షమవుతుంది. అలాగే pm65అని ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే పేజ్ మేకర్ తెరుచుకుంటుంది. అలాగే winwordఅని ప్రెస్ చేస్తే విండోస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. calcఅని ప్రెస్ చేస్తే కాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. అలాగే ఎక్సెల్ కొరకు excelఅనీ, నోట్ ప్యాడ్ కోరకు notepadఅనీ రన్ లో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయటం ద్వారా వాటిని సులభంగా తక్కువ సమయంలో అవసరమైన కొన్ని ప్రోగ్రాములను తెరవవచ్చును. ప్రయత్నించండి .....
Author: వర్మ
•10:14 AM
dc.exe వైరస్ పూర్తి స్వరూపం dungcoi.exe ఇది సిస్టంలోకి memory cards, pendrives వలన ప్రవేశిస్తుంది. ఈ వైరస్ లక్షణం ఏమిటంటే ఇది కర్సర్ ను busy గా ఉంచి సిస్టంను చాలా స్లో చేస్తుంది. ఈ వైరస్ కు సంబందించిన exe ను ఫోల్డర్ రూపంలో c:\windows లో చూడవచ్చును. కానీ దానిని తొలగించలేము. తొలగించాలని చూస్తె The file is currently in use అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దీనిని తోలగించడానికి avg కానీ, avast కానీ, Mcafe కానీ, smart antivirus కానీ ఆంటీవైరస్ లు పనిచేయవు.

దీనిని తొలగించాలంటే ఒక్కటే మార్గం అది..... సిస్టంను safemode with command propmt లో ఆన్ చేసి అందులో command prompt లో c:\windows లోకి డాస్ కమాండ్స్ ద్వారా వెళ్ళి del dc.exe అని టైప్ చేస్తే వైరస్ తొలగిపోతుంది. తర్వాత సిస్టంను నార్మల్ గా రిబూట్ చెయ్యండి.
Author: వర్మ
•10:08 AM
ఈ మద్య వస్తున్న చాలా వైరస్ లు మొదట సిస్టంలోని Taskmanager ను, Run , Registry Edit ను డిసేబుల్ చేస్తున్నాయి. ఈ వైరస్ లు Fun.Exe లేదా dc.exe వంటివి కావచ్చు . ఈ సందర్బంలో Task manager రన్ కాకపొవటం వలన ఎన్ని ప్రాసెస్లు రన్ అవుతున్నాయో తెలుసుకోవటం కష్టం అవుతుంది. కానీ సిస్టంను ఫార్మాట్ చేయకుండానే పై వాటిని restore చేయవచ్చును.

http://od3n.net/download/ సైట్ లోకి వెళ్ళి Smart antivirus ను మొదట డౌన్లోడ్ చేసుకోవాలి, smart antivirus ను setup చేసిన తరువాత రన్ చేయాలి. మిగితా ఆంటీవైరస్ ల లాగా smart antivirus క్లిక్ చేయగానే రన్ కాక సిస్టం ట్రెలో వచ్చి చేరుతుంది. సిస్టం ట్రేలో దానిని సెలక్ట్ చేసి Launch smart antivirus క్లిక్ చెయ్యాలి. అందులో restore windows default setting ను క్లిక్ చేసి తర్వత వచ్చే options లో మన సిస్టంలో ఏవేవి disable అయ్యాయో అవి సెలక్ట్ చెయ్యాలి. (default గా మన సిస్టంలో disable అయినవి ముందుగానే సెలక్ట్ చెయ్యబడి ఉంటాయి). తర్వాత ok నొక్కి సిస్టంను రిస్టాట్ చేయాలి.
ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆంటీవైరస్ ఇది newfolder.exe వైరస్ ను చాలా సమర్థవంతంగా తొలగిస్తుంది.దీని కొరకు remove virus from a folder ను క్లిక్ చేసి స్కాన్ చెయ్యాలి.
పైన తెలిపిన సైట్ లో వీటికే కాక చాల రకాల వైరస్ లను తొలగించే టూల్స్ లభిస్తాయి.