Author: వర్మ
•6:55 PM
నేను బి.ఎడ్ చేసే సమయంలో ఒక క్రిష్టియన్ పాఠశాలలో టీచింగ్ ప్రాక్టీసు చెయ్యవలసి వచ్చింది. అక్కడ పనిలో పనిగా ఆ పాఠశాలలో పనిచేసే ఒక టీచర్ పరిచయం అయ్యింది. ఒక సారి చర్చలో కృష్ణుడు 16000మంది స్త్రీలను ఎందుకు పెండ్లాడాడు ? అంత రసికుడినా మీరు పూజించేది అని ఆ టీచర్ ఎద్దేవా చేసింది. నాతోపాటు ఉన్న హిందూ మిత్రులంతా తెల్లమొఖం వేసారు. అవును కదా ... అని ఆ టీచర్ తో ఏకీభవించబోయారు.... ఇంతలో నాకు చిన్నప్పుడు నేర్చకున్న పై ప్రశ్నకు సమాధానం స్పురించింది. వెంటనే వారికి ఈ విధంగా సమాధానం చెప్పాను... అదే మీ ముందుంచుతున్నాను...

" నరకాసురుడు అనే రాక్షసుడు 16000మంది స్త్రీలను చెరబట్టి తన చెరసాలలో భందించాడు. అప్పుడు కృష్ణుడు నరకాసురుని చంపి ఆ స్త్రీలందరిని ఆ చెరనుండి విడిపించాడు. అయితే పరపురుషుని చెరలో ఉండి బయటకు వచ్చిన స్త్రీలందరు తమకు సమాజంలో ఎటువంటి విలువ ఉండదని, తమను సమాజం చిన్నచూపు చూస్తుందని, తమకు పెళ్ళిళ్ళు కావని, తమకు చావే శరణ్యం అని కష్ణునితో మొరపెట్టుకున్నారు.

అపుడు కృష్ణుడు వారికి సమాజం నుండి వచ్చే చిన్నచూపు నుండి రక్షించడానికి, వారికి సోషల్ స్టేటస్ ను కల్పించడానికి వారినందరిని పెండ్లాడి పట్టపు రాణులుగా చేసుకున్నాడు. ఇందులో కృష్ణుడు చేసిన త్యాగం ఉంది కానీ అతని స్వార్థం లేదు. " అని ఆవేశంగా చెప్పి ముగించాను. అంతే ఆ మరుక్షణం ఆ టీచర్ అక్కడి నుండి అదృష్యమయ్యింది. నా మిత్రలందరూ నన్ను అభినందించారు.

హరిసేవ లో దుర్గేశ్వర గారు రామాయణం గురించి వ్రాసిన విధానం, విశ్లేషణ చే ప్రభావితమై ఇది రాస్తున్నాను. హిందువులై ఉండి కూడా భిన్నంగా ఆలోచించాలి అనే విచిత్రమైన పోకడలతో సరియైన విధంగా హిందుత్వాన్ని, ఇతిహాసాల్ని అర్థంచేసుకోక విచిత్రమైన వాదనలతో హిందువులలోనే సందేహాలు రేకెత్తించే విధంగా కొందరు వాదిస్తున్నారు. మన ఇతిహాసాల్లో గల ప్రతి సంఘటనకు ఒక విష్లేషణ ఉంటుంది అది సూక్ష్మంగా ఆలోచిస్తేనే తెలుస్తుంది.
This entry was posted on 6:55 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

15 comments:

On October 25, 2008 at 9:36 PM , Anonymous said...

adbutham ga chepparu

 
On October 26, 2008 at 1:52 AM , Burri said...

బాగా చెప్పారు...

 
On October 26, 2008 at 4:18 AM , shaneer babu said...

వర్మ గారూ.. వివరణ బాగా ఇచ్చారు..నిజంగా ఈ విషయం నాకూ తెలీదు..

 
On October 26, 2008 at 8:28 AM , durgeswara said...

వర్మగారూ భేష్ చక్కని స్పందనచూపారు. ఇక ఇదే తరహా మరొక ప్రశ్న స్వాతమ్త్ర్య పూర్వమ్ గుంటూరులో థియోసోఫికల్ సొసైటి లోజరిగిన చర్చలో వచ్చినప్పుడు మాగురుదేవులు పూజ్య రాధికా ప్రసాద్ మహరాజ్ వారు సమాధానమ్ ఇచ్చారు.మిషనరీలనోర్లు మూతపడేలా.

ప్రశ్న: గోపికల వస్త్రాపహరణ చేసిన క్రిష్ణుడెలా దేవుడయ్యాడు?అది భ్గవమ్తుడయితేచేస్తాడా? ఈ ప్రశ్నకు మీరయితే ఏమి చెపుతారు? ప్రయత్నిమ్చి చూడండి. తరువాత వారిచ్చిన సమాధానం పమ్పుతాను కోరితే.

 
On October 26, 2008 at 9:29 AM , వర్మ said...

@ anonymous, భగవాన్, మరమరాలు ... ధన్యవాదాలు

@దుర్గేశ్వరా : సర్ నాకు తెలిసినది చెప్పాను. మీరడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు. దానికి కూడా సమాధానం బ్లాగు మిత్రులతో పంచుకోవాలనుకుంటున్నాను మీ ద్వారా ....

 
On October 26, 2008 at 4:34 PM , రాధిక said...

well said sir

 
On October 27, 2008 at 10:08 AM , Kathi Mahesh Kumar said...

మీ తర్కం చాలా హుదాంతంగా వుంది.శ్రీకృష్ణుడి "పవిత్రతకు" హారతులిచ్చేదిగా వుంది. అందుకే ఇన్ని ప్రశంసలు. ఇదే తర్కాన్ని కొంత ఘాటుగా వాడితే,భువనభాంఢాలు బద్దలయ్యేవి.

ఉదాహరణకి, మీరు చెప్పినతర్కాన్నే కొంచెం మార్చిచెబితే ఇలావుంటుంది.నరకాసురవధ తరువాత, అతడు చెరబట్టిన 16,000+ రాచకన్యల్ని ఊరిమీదకి వదిలేస్తే,వ్యభిచారం పెచ్చరిల్లి రాజ్యం అరాచకమైపోతుంది. ఈ పరిస్థితి గమనించిన కృష్టుడు తెలివిగా,ఎలాగూ గెలిచిన రాజుగా అధికారముందిగనక, దిక్కుతొచని స్థితిలో తానుతప్ప మరో దిక్కులేని రాచకన్యల్ని పెళ్ళిచేసుకుని...రాజుభార్యలనే "బ్రాండ్" తగిలించి జరగబోయే విపత్తునుంచీ రాజ్యాన్నీ,సమాజాన్నీ రక్షించాడు.

మీరు చెప్పినదానికీ నేను చెప్పినదానికీ interpretation లో మార్పేతప్ప facts లో ఎటువంటి మార్పూలేదు. కానీ, నేను చెప్పిన తర్కం అరాచకంగానూ,మీరు చెప్పింది అద్వితీయంగానూ చాలామందికి అనిపిస్తాయి. కారణం..వారు కావాలనుకున్నది మీరు చెప్పడం. ఇలాక్కూడా జరగొచ్చని నేను comfortable కాని ప్రశ్నలు లేవనెత్తడం.

 
On October 27, 2008 at 10:38 AM , వర్మ said...

@ రాధిక : ధన్యవాదాలు...

@ మహేష్ కుమార్ : మీకు ఇంత నిరాశ,ప్రపంచంలో జరిగే ప్రతివిషయం సక్రమ మార్గంలో జరగదు అనే ఒక ద్రుడ నమ్మకం ఎందుకు వచ్చిందో నాకర్థం కాలేదు. మీరన్నదే నిజమనుకున్నా, వారిని వ్యభిచార కూపం నుండి రక్షించడానికో లేక మరేదో కారణానికైనా రాజుగా రాజ్యాన్ని అరాచకం నుండి రక్షించాడు. ఇంక మీరన్న " బ్రాండ్ " అన్న పదానికి నేను వివరణ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే నేనంత నాస్తికున్ని కాను కాబట్టి, అంత అరాచకంగా ఆలోచించలేను కాబట్టి. మీకు చిన్న మనవి ...

" పై పోస్టింగ్ లోని చివరి భాగాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి "

 
On October 27, 2008 at 9:53 PM , త్రివిక్రమ్ Trivikram said...

ఒక చిన్న తేడా ఉందండీ.

నరకుడు చెరబట్టిందీ, అతణ్ణి చంపి శ్రీకృష్ణుడు పెళ్ళాడిందీ 16,100 మందిని. వాళ్ళు గోపికలు కారు. దేవ, యక్ష, గంధర్వ మొదలైన వేర్వేరు జాతులకు చెందినవారు.

 
On October 27, 2008 at 10:53 PM , Kathi Mahesh Kumar said...

@వర్మ,నా పాయింటల్లా అనుకూలతర్కాన్ని అంగీకరించిన వాళ్ళు ప్రకూలతర్కానికి నిరసించడం ఎందుకా!!అని మాత్రమే. ప్రతికూల తర్కాన్ని అంగీకరించకపోతే బాధలేదు. కానీ అదేదో పాపం,తప్పు, హిందూమతాన్ని తక్కువచెయ్యడానికి చేస్తున్నకుట్రలుగా భావించి బాధపడిపోవడం లేదా ఎద్దేవాచెయ్యడం అనవసరం.

నమ్మకాల్ని బలోపేతం చేసుకోవడానికివాడే తర్కమే, నమ్మకాల్ని ప్రశ్నించడానికి వాడితే తప్పొచ్చిందా?

 
On October 27, 2008 at 11:16 PM , తెలుగుకళ said...

శ్రీ కృష్ణుడు అన్ని యుగాలకి నిజమయిన ఆదర్శవంతమయిన జీవనానికి సిసలైన తార్కాణం. మతమౌఢ్యానికి కి దూరంగా ఒక చారిత్రక పురుషునిగా కృష్ణుడి జీవనాన్ని పరిశీలిస్తే :
అన్ని సుఖాలు, బంధాలు, శక్తులు, ఉద్వేగాల మధ్య ఉంటూనే వాటన్నిటికీ అతీతంగా ఎలా జీవించాలో నిరూపించాడు.
గోపికలతో కలిసి వారి ప్రేమామృతంలో పరవశించినట్లనిపించినా దాని వెనుక దాగి ఉన్న తత్వం భక్తి తత్వమేనని పెద్దలు చెపుతారు.
ఈ తత్వం పూర్తిగా అర్థం కావడానికి కొంత పరిణతికావాలి.
ఇక వస్త్రాపహరణ విషయానికొస్తే :
స్త్రీలు తమ అందంపై (బాహ్య సౌందర్యంపై) ఎక్కువ ధ్యాసపెట్టి ఆంతరంగిక సౌందర్యాన్ని అలక్ష్యం చేయకూడదనే ఉద్దేశ్యంతోను, పరమార్థ సాధనకు మోహమనే పాశాన్ని(వస్త్రం) తస్కరించడం ద్వారా మనుషుల మధ్య ఎలాంటి భేదాలూ ( వస్త్రాలు లేనపుడు మనుషుల మధ్య ధనిక- పేద, అందం-అందవిహీనం తేడాలు ఉండవనీ, అలంకారాలు, ఖరీదయిన వస్త్రాలతో వచ్చే అందం అశాశ్వతమనీ) లేవనీ తెలియచెప్పి, వారి అసలు రూపం ద్వారా శాశ్వత తత్వాన్ని బోధించి ఉండవచ్చని నా అభిప్రాయం.
సరయిన దృష్టితో చూస్తే ప్రతి మతం లోనూ ప్రతి దైవంలోను ఈ తత్వం కనిపిస్తుంది.
రూపాలు వేరైనా తత్వం ఒక్కటే.అది అర్థం కాని వారు తరచూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూఉండటం విచారించవలసిన విషయం.
తెలుగుకళ - పద్మకళ
www.telugukala.blogspot.com

 
On October 28, 2008 at 10:37 AM , వర్మ said...

@ త్రివిక్రమ్ : మీరన్నది నిజమే సర్. కాని పోస్టింగ్ చేసేముందు ఆలోచించలేదు..

@ తెలుగుకళ గారు : మీరిచ్చిన వివరణకు ధన్యవాదాలు. దుర్గేశ్వర గారి ప్రశ్నకు జవాబు చెప్పారు.

@ మహేష్ గారు : ఇష్టమైనవి,నచ్చినవి అనుకున్నచోట ప్రతికూల వాదనకు తావుండదు. ఎందుకంటే అది నిజంగా పాపమే అవుతుంది. మీరు నాస్తికులు కాచట్టి పాపం అంటే నమ్మరు. తర్కం మనిషిని హాయిగా నడిపించేదిగా ఉండాలి కానీ మన మనుగడను ప్రశ్నించేదిగా ఉండగూడదు. మీ ఫిష్ బోల్ ని ఇంకాస్త పెద్దది చేసి ఆలోచించండి...

 
On October 28, 2008 at 7:03 PM , చింతా రామ కృష్ణా రావు. said...

సీ:-వర్మగారూ మీరు వర్ణించి చెప్పిన - వన్నియు నిజమౌను. ఐనగాని
ఒక్కప్రశ్నడుగుడు ఊరకుండకమీరు - ఎదురు ప్రశ్నించిన ఎవరినైన
తృష్ణ తీర్చగ బూన్ - కృష్ణుడే యుగమున పదునారు వేల్మంది పడసె ననుచు.
ఆ యుగ ధర్మంబు అరయుడు ముందంచు. - రాణులెందరికైన రాజొకండె.
గీ:-కలి యుగంబున జనియించి తెలియనగునె?
కృష్ణ లీలలు? సద్ భక్తి తృష్ణ గలుగ
జ్ఞాన సంపత్తి కలుగును. జ్ఞాని కెఱుక
యగుననుచు, మీరు తెల్పుడు. స గరువముగ.

అభినందనలతో
చింతా రామ కృష్ణా రావు.
{ ఆంధ్రామృతం బ్లాగ్ }

 
On October 29, 2008 at 5:49 PM , వర్మ said...

@త్రివిక్రమ్ గారు : మీరు చెప్పినట్లుగానే గోపికలు అన్న స్థానంలో స్త్రీలు అని మార్పు చేసాను ..

@ చిం.రావు గారు : మీలా పద్య రూపంలో నేను ధన్యవాదాలు చెప్పలేను కానీ, మీకు మాత్రం చాలా ధన్యవాదలండి....

 
On May 7, 2009 at 10:39 PM , S K P said...

meeru kathalu bhaga chepi namistaru sumaa....