Author: వర్మ
•5:27 PM


ఇవాళ ఒక కళాశాలను దర్శించాను. అక్కడ ర్యాగింగ్ ను నిరసిస్తూ ఒక పోస్టర్ కనబడింది. వెంటనే నాకు నా పి.జి ప్రారంభపు రోజులు గుర్తుకు వచ్చాయి. నేను పి.జి హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో చేసాను. హాస్టల్ లో మా సీనియర్స్ మేము ఎప్పుడు వస్తామా అని ఎదురుచూస్తూ కూర్చున్నారు. హాస్టల్ లో చేరగానే ర్యాగింగ్ ప్రారంబించారు. ర్యాగింగ్ అంటే పెద్దగా ఏమీ ఉండేది కాదు గానీ మమ్మల్ని నిల్చోబెట్టి పనికి రాని ప్రశ్నలన్నీ అడిగేవారు. హాస్టల్ లోనే ఇలాగ ఉంటుందేమో అనుకుని కాలేజికి వెళితే అక్కడ ఇంకా దారుణం అబ్బాయిలకి అమ్మాయిలు కూడా తోడయ్యి అమ్మాయిలు,అబ్బాయిలు కలిసి ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు. ఒక అమ్మాయి నేను బాగున్నానా ? అని అడుగుతుంది. అవును బాగున్నావు అంటే వెంటనే పక్కన ఉన్న అమ్మాయి నేను బాగాలేనా ? అని మెలిక పెడుతుంది. లేదు ఇద్దరు బాగున్నారంటే కాదు కాదు ఇద్దరుట్లో ఎవరు బాగున్నారు చెప్పు అని ప్రశ్నిస్తారు. సమాధానం చెప్పలేక మనం పడే అవస్థను చూసి హాయిగా నవ్వుకునేవారు. . . మొదట మూడు రోజులు అన్నీ ఓపికగా సహించాను ఒక రోజు మాత్రం సుమారు నాలుగు గంటలపాటు హాస్టల్ లో నిల్చోబెట్టి పనికి రాని ప్రశ్నలన్నీ సంధించి మొత్తం బుర్ర తినేసారు. ఇంక లాభంలేదనుకుని హైదరాబాద్ లోనే ఉంటున్న మా కజిన్ ఇంటికి వెళ్ళి అక్కడ రెండు,మూడు రోజులు గడిపి వచ్చాను. మా కజిన్ ఇవన్నీ కళాశాల స్థాయిలో సర్వసాధారణమని బూస్టింగ్ ఇచ్చి పంపారు. ధైర్యంగా హాస్టల్ లోకి అడుగు పెట్టేసరికి పరిస్థితి తలక్రిందులయ్యింది. విషయం ఏమిటంటే మా బ్యాచ్మెట్ లలో ఎవరో ఎ.బి.వి.పి వారికి కాంప్లెంట్ ఇచ్చారట. వాళ్ళు ర్యాగింగ్ మానుకున్నారట. సీనియర్స్ ఎవ్వరూ మాతో మాట్లాడలేదు. ఇదంతా ఫ్రెషర్స్ పార్టీ వరకే !! ఫ్రెషర్స్ పార్టీ పూర్తి కాగానే సీనియర్స్ కూడా మాతో క్లోజ్ గా మెలగటం మొదలుపెట్టారు. చాలా విషయాలలో గైడెన్స్ కూడా ఇచ్చారు. నిజంగా ఇంత మంచి వారిపైననా మేము కోప్పడింది అనే విధంగా చేసారు. మొదట్లో వారిపై కోపం కలిగినా నిజంగా వారు కొర్సు పూర్తి చేసుకుని వెళుతుంటే చాలా బాధనిపించింది. మేము సెకండియర్ వచ్చి సీనియర్స్ అయినపుడు మాత్రం మేము ఏ విషయాలతో అయితే ఎక్కువగా బాధపడ్డామో అలాంటి ఇబ్బంది మా జూనియర్స్ కు కలగకుండా చూసుకున్నాం. కేవలం పరిచయాలు, బయోడాటా చెప్పించటంతోనే సరిపుచ్చుకున్నాం. మొత్తానికి నా పి.జి రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి. ర్యాగింగ్ అనేది శృతిమించనంత వరకు ఫర్వలేదు. అతి చేయకుండా, తమ తమ హద్దుల్లో ఉండి ఒక మాడరేట్ గా చేసే ర్యాగింగ్ నిజంగా హృదయంలో ఒక తీయని గుర్తుగా కలకాలం నిలచిపోతుంది. అప్పుడు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది....
This entry was posted on 5:27 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

5 comments:

On October 30, 2008 at 6:47 AM , చిలమకూరు విజయమోహన్ said...

మంచిటపా . ర్యాగింగ్ అనేది పరిచయాలు పెంపొందించుకునేందుకు ఉపయోగపడాలిగానీ పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం మాదిరి ప్ర్రాణాంతకం కాకూడదు.సరదాగా ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుకుతెచ్చుకుని నవ్వుకునేవిధంగా ఉండాలి.

 
On October 30, 2008 at 1:31 PM , రాధిక said...

మంచిటపా

 
On November 12, 2008 at 11:51 PM , Anonymous said...

mimmlni NIZAM COLLEGE lo chesina ragging viseshalu kuda chepte inka bagundedi

 
On November 12, 2008 at 11:55 PM , వర్మ said...

@anonymous : పైన రాసినది నన్ను నిజాం కళాశాలలో చేసిన ర్యాగింగ్ గురించే .......

 
On April 8, 2013 at 11:30 PM , Anonymous said...

Please let me know if you're looking for a article writer for your site. You have some really good articles and I believe I would be a good asset. If you ever want to take some of the load off, I'd really like to write some content for your blog in exchange for a link back to mine.
Please blast me an e-mail if interested. Thank you!

Review my site ... Zahngold