•12:24 PM
ఆశ
ఇది ఎమి జీవితం ?
రాత్రుళ్ళు నిద్ర కరువాయె
పగళ్ళు శ్రద్ద కరువాయె
మౌనమె దగ్గరి బందువాయె .....
ఖరీదైన వస్తువుల మద్య
నిరుపేదనై నిలుచున్నా .....
మనిషికైన గాయం కన్నా
మనసుకైన గాయం మిన్నని,
విడిచిన బాణం కన్నా
ఆడిన మాటలు వాడని,
ఎపుడు తెలుసుకుంటారో
ఈ మాయ ప్రజలు ......
మంచితనం విలువ తెలియని
అమాయకులని వదిలెయ్యాలో,
కాలం కన్ను కప్పలేరని
బుద్ది చెప్పాలో తెలియని
సందిగ్ద పరీస్థితి ......
కష్టాలు కన్నీల్లతో పాటు
కవితలు రప్పిస్తాయని
తెలియలేదు నిజమని నేటివరకు,
నేటి చీకటే రేపటి
వెలుగన్న గొప్పవారి వాక్కులను
వమ్ము చేయక,
జీవిస్తున్నా రేపటి
అరునోదయం పై ఆశతొ ......
మీ ....
..... వర్మ
0 comments: