Author: వర్మ
•11:42 AM
నేను ఉపాధ్యాయుడిని కావటం వలన మా పాఠశాలలో ఇటీవల ప్రబుత్యం ప్రవేశపెట్టిన నిజాయితీ పెట్టె గురించి కొన్ని వాక్యాలు వ్రాయాలనుకున్నాను.
మా పాఠశాలలో గల నిజాయితీ పెట్టె పిల్లల్లో నిజాయితీని ప్రోత్సహించడానికి నిర్దేశించబడినది. ఎవరైనా విద్యార్థికి ఏదైనా వస్తువు దొరికితే దానిని తనవద్ద ఉంచుకోక ఆ నిజాయితీ పెట్టెలో వేస్తాడు . దానిని ఆరోజు పిల్లలందురు పాఠశాలను వదిలి వెళ్లేటపుడు మా ప్రధానోనాద్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను విచారించి ఆ వస్తువు ఏ విద్యార్థికి చెందుతుందో ఆ విద్యార్థికి అప్పజెబుతారు, అంతేకాకా ఆ వస్తువును తెచ్చి ఆ పెట్టెలో వేసిని విద్యార్థిని మిగితా విద్యార్థుల ముందు అతని నిజాయితిని మెచ్చుకుంటారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, పిల్లల్లో నిజాయితీని ప్రోత్సహించడం. నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నిజాయితీ పెట్టెను ప్రవేశపెట్టడం హర్షనీయం .....
ప్రస్తుత సమాజంలో డజను అరటిపళ్లు కొన్నా అందులో ఒకటో రెండో పుచ్చులు రావడం ఖాయం. నిజాయతీగా తోటి వ్యక్తికి సాయపడదామన్న ఆలోచన కొరవడిన తరుణంలో మొగ్గగా ఉన్నపుడే ఈ లక్షణాలను అలవరచడానికి ఇలాంటి పాఠశాలల్లో ప్రవేశపెట్టడం చాలా అవసరం.
’’పాఠశాలల్లో జరగవలసింది వ్యక్తి నిర్మాణం మరియు శీల నిర్మాణం’’ అన్నట్టుగా విద్యార్థిని సమాజానికి పనికివచ్చే వ్యక్తిగా తీర్చిదిద్దడం పాఠశాలల లక్షం. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తాయని ఆశిద్దాం !!!!!
This entry was posted on 11:42 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 comments:

On June 30, 2008 at 9:15 PM , Kathi Mahesh Kumar said...

బాగుంది మంచి ఆలోచన. నా చిన్నప్పుడు నేను చదివింది గురుకుల పాఠశాల అవడం మూలంగా వస్తువులు పోవడాలూ, దొరకడాలూ, అస్సలు కనపడకుండా పోవడాలూ సాధారణంగా జరిగేవి. అక్కడ కూడా పోయినవాటిని ఒక రూములో చేర్చే ఒప్పందం ఉండేది. మళ్ళీ వాటిని ప్రెయర్ టైంలోనో లేక సాయంత్రం అసెంబ్లీ లోనో ఎవరివివారికి ఇచ్చేవారు.

 
On July 1, 2008 at 11:14 AM , Rajendra Devarapalli said...

నిజాయితీ పెట్టె అన్న ఉద్దేశ్యం బాగుంది కానీ వర్మ గారూ,స్కూలులో పోగొట్టుకుంటే ఆ పెట్టెలో ఉంటాయి.రోడ్లమీదా,ఇంకెక్కడో పోగొట్టుకుంటే??అందుకే దీనితో పాటుగా జాగ్రత్తలు,పక్కపిల్లల వస్తువులు కాజేయకూడదనే సూచనలూ ఇస్తే ఇంకా బాగుంటుందని నా భావన.

 
On July 2, 2008 at 5:08 AM , వర్మ said...

రాజేంద్రకుమార్ గారు మీరన్నది కరక్టే. కాని విద్యార్థి మొదట పాఠశాలతో అనుభందాన్ని కలిగి ఉంటాడు తరువాత సమాజంతో అనుభందాన్ని ఏర్పరచుకుంటాడు.విద్యార్థి తొలుత పాఠశాలలో మంచిచెడులు నేర్చుకుంటే తరువాత దాన్ని సమాజంలో అన్వయించి ఆచరిస్తాడు. పాఠశాలలో పరుల సొమ్ము పామువంటిది అన్న నానుడిని విద్యార్థికి ఒంటబట్టిస్తే బయట దొరికిన వస్తువును కూడా వాటి యజమానికి అప్పజెప్పాలనే దృక్పదం అలవడుతుందని నా అభిప్రాయం. ఏమంటారు ??
ఇక తమ వస్తువుల గురించి జాగ్రత్తలు ప్రతిరోజూ చెప్తుంటాము సర్.