•2:48 AM
" గాంధీలాంటి మహానుభావుడు రక్తమాంసాలతో ఈ భూమిపై నడిచాడంటే తర్వాత తరాలు నమ్మకపోవచ్చు " అని తన తెలివితేటలతో ప్రపంచాన్నే అబ్బురపరిచిన ఐన్ స్టీన్ మహాశయుడు అన్నారు. ప్రస్తుతం గాంధీని తిట్టటమే ఫ్యాషన్ భావిస్తున్న ఈ తరానికి అతని సేవలు అర్థం కాకపోవచ్చును. ప్రస్తుతం పోలీసుల సహాయం లేనిదే అడుగు ముందుకు వేయలేని ఎం.ఎల్.ఎ లు, ఎంపిలకు అహింసా మార్గంలో గాంధీజీ స్వాతంత్ర్యం తెచ్చాడంటే అవహేళనగా అనిపించవచ్చును. దురష్టకరమైన విషయం ఏమిటంటే భావితరాలకు మహాత్ముని గొప్పతనాన్ని బోధించాల్సిన ఉపాధ్యాయయులే తప్పుచేస్తున్నారు. అటువంటి వారికందరికీ ఆ మహాత్ముడు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటూ... గాంధీజయంతి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు.
కబుర్లు
|
3 comments:
గాంధీజీ కి నా నివాళి.
ఇది చదవండి: http://ramakantharao.blogspot.com/2008/10/blog-post.html
బాగా చెప్పారు సార్.
నిజంగా ఇదేం పాపిస్టి ఫాషనొ అర్దంకావడం లేదు.
గాంధికి వ్యతిరేకంగా మాట్లాడే యువత ఎక్కువ కనబడుతున్నారు.
మాట అనడానికి ఒక్క సెకను చాలు.. కాని నిజం తెలుసుకుని మట్లాడితె మంచిది అని నా మనవి.
అంతా బాగుంది ఉపాధ్యాయులందరు చెడ్డవారు కాదుకదా సార్