Author: వర్మ
•11:06 PM

TSGLI పూర్తి వివరాలు 










పెరిగిన మొత్తానికి నూతన బాండ్ కొరకు అప్లై చేయుటకు ....

1.ప్రపోసల్ ఫామ్.
2.కవరింగ్ లెటర్.
3.డిడేక్షన్ స్టేట్మెంట్.
4.ఆగస్ట్ నెల పే స్లిప్.

🏵️సూచనలు🏵️
👉ప్రపోసల్ ఫామ్ 3 వ పేజీలో గెజిటెడ్ సంతకం
(Gazeeted సంతకం తప్పనిసరి కాదు) 
👉కవరింగ్ లెటర్ పై DDO. సం.మరియు Lr. no.
👉పే స్లిప్ పై DDO సం.
👉డిడేక్షన్ స్టేట్మెంట్ పై  DDO సం.

TSGLI PREMIUM  ను ఉద్యోగి వయసు 56 సంవత్సరాల వరకు ప్రీమియం పెంచుకోవచ్చు (గతంలో ఇది 53 సంవత్సరాల వరకే ఉండేది)

క్రింద తెలిపిన విధంగా DDO లు ఆగస్టు 2021 నుండి క్రింది విధంగా కచ్చితంగా ఉద్యోగుల జీతం నుండి మినహాయింపు చేయాలి

 🔥TSGLI సమాచారం ముఖ్యమైన ఉత్తర్వులతో:🔥

2020 రివైజ్డ్ స్కేల్స్ అనుసరించి TSGLI స్లాబు రెట్లు సవరించడం జరిగింది. (G.O.Ms.No.91 తేది:16-08-2015)

💠 pay from Rs.19000 to Rs.242800-Rs.750

💠 pay from Rs.24281 to Rs.310400-Rs.1000

💠 pay from Rs.31041 to Rs.42300-Rs.1250

💠 pay from Rs.42301 to Rs.51320-Rs.1700

💠 pay from Rs.51321 to Rs.71000-Rs.2000

💠 pay from Rs.71001 &162070  -Rs.3000

👉 స్లాబురేట్ల పైన కాకుండా బేసిక్ పే పై 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు. 
(G.O.Ms.No.26 తేది:22-02-1995)

సరళీకరరించిన ప్రతిపాదన దరఖాస్తును ప్రవేశపెట్టడం జరిగింది.
(G.O.Ms.No.189 తేది:10-07-2013)

మున్సిపల్ ఉద్యోగ,టీచర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.ఎయిడెడ్ టీచర్లకు వర్తించదు.
(G.O.Ms.No.25 తేది:03-03-2011)

🔥21 సం॥ పైన 56 సం॥ లోపు వయస్సు గల రాష్ట్ర ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులు,10 సం॥ సర్వీసు పూర్తిచేసిన వర్క్ చార్టెడ్ ఉద్యోగులు తప్పనిసరిగా తమజీతాల నుంచి రికవరీ చేసి పాలసీబాండ్ పొందాలి.

👉 గర్భిణీలు ప్రసవించిన 6 నెలల తరువాతే భీమాకు అర్హులు.

👉ప్రస్తుతం పాలసీ చెల్లిస్తున్నవారు 48 సం॥ దాటినవారు మరోపాలసీ 56 సం॥ల వయస్సు వరకు మాత్రమే తీసుకోవచ్చును.
(Memo.No.29335/342/A2 తేది:05-03-2010 & G.O.MsNo.92 తేది:17l6-08-2021)

👉అప్రెంటీస్ వ్యవస్థ రద్దుకావడం వల్ల 1సం॥ వరకు వేచి వుండకుండా మొదటి నెల జీతంతో మినహాయించవచ్చు.
(G.O.Ms.No.199 తేది:30-07-2013

👉ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం మినహాయించి, ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని జిల్లా కార్యాలమునకు పంపవలసిన బాధ్యత DDO లకు ఉంది.
(G.O.Ms.No.43 తేది:21-01-1989)     (G.O.Ms.No.368 తేది:15-11-1994)

👉 పాలసీ నెంబర్ మరియు నామిని వివరాలు విధిగా సర్వీసు రిజిస్టరులో నమోదు చేయించాలి.

👉TSGLI ప్రీమియంకు సెక్షన్-80సి ప్రకారం ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కలదు.

👉సం॥కి 9% వడ్డీతో 90% వరకు లోన్ సౌకర్యం కల్పిస్తారు.

👉Sum Assured 10 లక్షలు దాటిన సందర్భంలో గుడ్ హెల్త్ సర్టిఫికెట్ మరియు  Non Availment on leave on medical ground certificate సమర్పించాలి.

👉 *బాండ్ పై లాస్ట్ ప్రీమియం డేట్ స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది.ఆ  ప్రకారం డిడక్షన్స్ ఆపివేయాలి. ఇన్సూరెన్స్ మాత్రం రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది.


NOTE:

➡️ TSGLI మన భీమా ప్రీమియం మొత్తం విలువ 15 లక్షలు అయిందో లేదో తెలుసుకోవడానికి, ప్రతి ఉద్యోగి TSGLI site లో policy details option ఉన్న sum assured అనే కాలం లోని మొత్తం అమౌంట్ లను TOTAL చేసుకోవాలి.ఒకవేళ TOTAL SUM ASSURED అమౌంట్ 15 లక్షలు దాటితేనే GOOD HEALTH CERTIFICATE &  MEDICAL LEAVE ( గత మూడు సంవత్సరాలకు సంభందించిన) Particulars CERTIFICATE attach చేయాలి.

|
This entry was posted on 11:06 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

0 comments: