•7:17 AM
ఈ మద్యనే మా పాపకు బాసర సరస్వతీ ఆలయంలో అక్షరాభ్యాసం చేయించాం. పక్కన ఉన్న ఫోటో అక్కడే గుడిలో తీసింది.
మా పాప అస్సలు అల్లరే చేయదు కానీ, ఎందుకో ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరు అమ్మో!! మీ పాపనా 'చాలా అల్లరి పిల్ల' అంటారు. తనేమంత అల్లరి చేస్తుందని ?
పక్కింటి లక్కీగాని బొమ్మలు లాక్కొని వస్తుంది అదేం పెద్ద అల్లరి పనా ఏంటి ? ఒకే రకమైన బొమ్మలతో ఆడుకుంటే బోర్ కొట్టదా మరి .. .
తను నీళ్ళతో ఎక్కువగా ఆడదుకాని వాష్ బేషిన్ దగ్గర రోజుకోసారైనా కుర్చీ వేసుకుని గంటసేపు చేతులు కడుగుతుంది పిల్లలన్నాక ఇది సాధారణమే కదా ! కాకపోతే ట్యాంకులో నీళ్ళు, సబ్బు త్వరగా అయిపోతాయి.
కంప్యూటర్ జోలికి ఎక్కువగా వెళ్ళదు కానీ నేనదయినా వర్క్ మద్యలో వదిలి వెళితే మాత్రం తనకు ఇష్టం వచ్చిన కీలు నొక్కేసి నాకు అర్థం కాని ఎర్రర్ తెచ్చిపెడుతుంది తర్వాత నేను కంప్యూటర్ ఎరా చాట్ రూం హెల్ప్ తీసుకోవడమో లేక టెక్నిషియన్ ని పిలవడమో జరుగుతుందనుకొండి ! పిల్లలకు కంప్యూటర్ కూడా అవసరం కదా ...
ఇంక తన తమ్మున్ని ఎంత బాగా చూసుకుంటుందో !! వాడికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని మొఖానకి కాటుక తనే పెడుతుంది కాకపోతే ఆ మొఖం మేముకూడా గుర్తుపట్టలేమనుకొండి. అప్పుడప్పుడు వాడు వెళ్ళే దారికి అడ్డుపడుతుంది బహుషా అటువైపు వెళితే ప్రమాదం అని కాబోలు. వాడు ఏడవడం సాధారణమే కదా. అయినా వాడేం తక్కువనా.. అమ్మ దగ్గర పాలు తాగి వాడి బొమ్మలతో వాడు ఆడుకుంటాడు.
ఇంక నా పుస్తకాల విషయానికొస్తే తనకు నచ్చిన బొమ్మలు, పైన కవర్లు చింపేస్తుంది. నాకు పుస్తకాల కలక్షన్ హాబీ చాలా పుస్తకాలకు పైన అట్టలుండవు అంత మాత్రాన పుస్తకం లోపల ఉన్న మ్యాటర్ ఏమయినా చెరిగిపోతుందా!!
పెద్దవాళ్ళను తిట్టటమేమీ చెయ్యదు కానీ ఒక అయిదారు తెలంగానా తిట్లు మాత్రం నేర్చుకుంది. తనకు మాత్రం కోపం ప్రదర్శిండానికి ఆ మాత్రం తిట్లు తెలియటం అవసరమే కదా !!
ఇంక ఫంక్షన్ లకి తనే తయారవుతానంటుంది. ఎవరి పని వారే చేసుకొవడంలో తప్పులేదు కదా! కాకపోతే పౌడర్ తో మేము చూడనప్పుడు ఆడుతుంది. మొఖానికి కొంచెం అంటే చాలా కొంచెం పౌడర్ వేసుకుంటుంది. నమ్మకపోతే క్రింది తన ఫోటో చూసి మీరే చెప్పండి.
ఇంక మమ్మల్నెంత బాగా అర్థం చేసుకుంటుందో! మొన్న బాసరకు వెళ్ళేటపుడు నడుస్తున్న ట్రయిన్ దిగి కురుకురే ప్యాకెట్ తీసుకురమ్మని ఒకటే ఏడుపు సుమారు గంటసేపు తోటి ప్రయాణికులందరు వీళ్ళెప్పుడు దిగిపోతార్రా అని ఎదురు చూసారనుకొండి అది వేరే విషయం ...
ఇంక అన్నం తినేటపుడు మాత్రం అస్సలే ఇచ్చంది ఉండదు. అన్నం ముద్ద నోట్లోకి వెళ్ళగాని పరిశోధన ప్రారంబమవుతుంది. పరిశోధన సుమారు 10నిమిషాల పాటు సాగి రెండవ ముద్ద ఎంట్రీతో ముగుస్తుంది. ముద్ద నోట్లో ఉన్నంత సేపు హనుమంతుడిలా మూతిని ముందుకు చాచి ఉంచుతుంది ...
ఇంకా చాలా ఉన్నాయండీ చెప్పాలంటే ........ మచ్చుకు కొన్ని చెప్పాను ఇప్పుడు మీరయినా చెప్పండి 'మాపాప అల్లరి పిల్లనా' ......
ఎన్ని చేసినా We love Her..... ( చివరిది మాత్రం నిజమండి ..... )
కబుర్లు
|
14 comments:
మీపాప అల్లరిపిల్ల అస్సలు కాదు :)
bhale mudduga undi mee papa.
allaripilla la assalu ledu
మీ పాప అల్లరి పాప ఎవరు చెప్పింది ఎవరు... :)
మీ పాపను భలే వెనకేసుకొస్తున్నారే... :-)
entha mudduga akshrabyasam chestndo...allaripilla...?
very cute
ఇది అల్లరి కాదంటే కాదు! :-)
అల్లరి చెయ్యటం పిల్లల జన్మ హక్కు. మీకు మంచి కాలక్షేపం అయితే.. మా అక్క కొడుకు లక్కీ అంతే అస్సలు అల్లరి చెయ్యడు. ట్రైన్ లోంచి సెల్లు ఫోన్ పడేయటం, సెల్లుఫొన్ తీసి నీళ్ళ కుండీ లో వేయటం, టీపాయ్ అద్దం బద్దలు కొట్టడం లాంటివి చేస్తాడు అంతే.
ఐనా ఆడపిల్లలు ఆ మాత్రం హుషారుగా ఉండకుంటే ఎలా? బొత్తిగా ముద్దపప్పు అనరూ...
@శివ,రాణి, చైతన్య: ధన్యవాదాలు. అవును అది మాకు కూడా అల్లరిలా అనిపించదు.
@నాగప్రసాద్ : కాకి పిల్ల కాకికి ముద్దు కదా . ....
@జగన్,కొత్తపాళి : ధన్యవాదాలు .
@ మురళి : మా ఇంటి దగ్గర కూడా ఒక లక్కి ఉన్నాడు కానీ మా పాప ఎప్పుడు వాన్ని గెలవనివ్వదు.
@ జ్యోతి గారు : నిజమేనండి.
idi allari pillajkaadu. allari pidugu. chiranjeeva chiranjeeva
allari pilla anakandi maa papa chala active papa ani cheppandi..
@ దుర్గేశ్వరా గారు : ధన్యవాదాలు ...
గంగాప్రసాద్ : ఇక అలాగే చెబుతాను సర్ ...
U narrate it excellent